Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీ అమ్మిన సోనూసూద్.. ఎగబడిన అభిమానులు

  • నాగపూర్‌లో టీస్టాల్ వద్ద గడిపిన సోనూ
  • సోనూ నటించిన ‘సింబా’ పెద్ద సక్సెస్
  • మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల వసూలు 
ప్రముఖ నటుడు సోనూసూద్ ఓ టీ స్టాల్‌లో టీ అమ్మారు. ఆ టీని కొనుక్కునేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. సోనూ కాలేజ్ లో చదివే రోజుల్లో నాగపూర్‌లోని ఓ టీ స్టాల్‌లో ఎక్కువగా గడిపేవారట. తాజాగా ఆయన నాగపూర్‌కి వెళ్లి చిన్ననాటి విషయాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. సోనూ ప్రతినాయకుడి పాత్రలో నటించిన ‘సింబా’ చిత్రం మంచి సక్సెస్ సాధించింది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు రాబట్టింది.

ఈ నేపథ్యంలో నాగపూర్ వెళ్లిన సోనూ అక్కడి విశేషాలను ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. ‘సింబా సినిమా సక్సెస్‌ను నాగ్‌పూర్‌ టీ స్టాల్‌ వద్ద సెలబ్రేట్‌ చేసుకుంటున్నాను. నా కాలేజ్‌ రోజుల్లో  ఎక్కువగా ఇక్కడే గడిపాను. ఆనాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసుకుంటున్నాను’ అని సోనూ అప్పటి విషయాలను చెబుతూ టీ అమ్ముతున్నప్పుడు తీసిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.‌ అయితే సోనూ అమ్మిన టీ కోసం అభిమానులు ఎగబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రదేశానికి వచ్చి పరిస్థితిని అదుపు చేశారు.
Sonu Sood
Tea Stall
Nagapore
Simba MOvie
Police

More Telugu News